19, నవంబర్ 2022, శనివారం

చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ లో మైదుకూరు జడ్పీ హైస్కూల్ విద్యార్థులకు మండలంలో ప్రథమస్థానం

  జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలోకడప జిల్లామైదుకూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చెకుముకి మండల స్థాయి సైన్స్ సంబరాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ పాఠశాలల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు  అదేవిధంగా పరీక్షలో ప్రథమ స్థానంలో  తెలుగు మీడియంలో నిలిచిన జడ్.పి.హెచ్.ఎస్ మైదుకూరు పాఠశాలల విద్యార్ధులు ఎస్. రోహిత్ కుమార్, సి. యాసిన్, ఎస్. మహమ్మద్ ఆలీ లకు బహుమతులను అందజేయడం జరిగింది. అలాగే ఇంగ్లీష్ మీడియం లో శాంతినికేతన్ విద్యార్ధులు ప్రధమంగా నిలిచారు. ఈ కార్యక్రమంలో జడ్.పి.హెచ్.ఎస్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలగంగాధర్  రావు  మాట్లాడుతూ చెకుముకి వంటి టాలెంట్ టెస్టులు రాయడం వల్ల విద్యార్థులలో మేధాశక్తి పెరుగుతుందని వారి యొక్క భవిష్యత్తుకు ఉపయోగపడతాయని తెలియజేశారు  అదేవిధంగా ఈ విద్యార్థులు  జిల్లాస్థాయి చెకుముకి సంబరాలకు హాజరవుతారని తెలియజేశారు నిత్యజీవితంలో సైన్స్ ఎంతో ఉపయోగపడుతుందని సైన్స్ పట్ల అవగాహన పెంచుకోవాలని భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు సూర్యనారాయణ రెడ్డి , భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు సత్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు.  జన విజ్ఞాన వేదిక మండల  అధ్యక్షుడు సుబ్బయ్య  సోషల్ మీడియా కన్వీనర్ గురులాల్ సమతా కన్వీనర్ శివ నాగలక్ష్మి యూత్ కన్వీనర్ సురేష్ విద్యార్థులు  గారు తదితరులు పాల్గొన్నారు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

గమనిక: ఈ బ్లాగు యొక్క మెంబర్‌ మాత్రమే కామెంట్‌ను పోస్ట్ చెయ్యగలరు.

చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ లో మైదుకూరు జడ్పీ హైస్కూల్ విద్యార్థులకు మండలంలో ప్రథమస్థానం

  జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలోకడప జిల్లామైదుకూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చెకుముకి మండల స్థాయి సైన్స్ సంబరాలు నిర్వహించడ...